Mon Dec 09 2024 05:08:09 GMT+0000 (Coordinated Universal Time)
Renuka Choudary : కేసీఆర్ పై రేణుక ఫైర్
రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి అన్నారు
రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదని కాంగ్రెస్ నీనియర్ నేత రేణుక చౌదరి అన్నారు. ప్రతి మనిషిపైనా లక్షకు పైగా భారం మోపి బీఆర్ఎస్ దొంగతనాన్ని బయటపెట్టేందుకే రాహుల్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా చేసిన దొంగ విత్తనాల మూలంగా ఎనిమిదివేల కుటుంబాలు నాశనమయ్యాయని ఆమె అన్నారు. అధికార మదంతో కేసీఆర్ విర్రవీగుతున్నారని రేణుక చౌదరి ఫైర్ అయ్యారు.
కాళేశ్వరంతో...
కాళేశ్వరం వల్ల బంగారం అంత కేసీఆర్ ఫ్యామిలికి చేరిందని రేణుక ఆరోపించారు. థరణి పోర్టల్ ను పెట్టి కేసీఆర్ రైతుల భూములను కాజేసింది నిజం కాదా? అని రేణుక ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఏమందని ఆమె నిలదీశారు. ఆ ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల గురించి కేసీఆర్ ఆలోచించారా? అని రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీ టు పీజీ అన్నారని, తర్వాత దాని ఊసే మరిచిపోయారని రేణుక అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల సామాన్యుడికి మేలు జరగలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
Next Story