Sun Mar 08 2026 05:45:16 GMT+0530 (India Standard Time)
ఇంకా చాలా మంది పార్టీని వీడతారు : మర్రి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలాగే మరికొందరు పార్టీని వీడతారని తెలిపారు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలాగే మరికొందరు పార్టీని వీడతారని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఒక హోంగార్డు పార్టీ నుంచి వెళితే ఏమీ కాదని వ్యంగంగా వ్యాఖ్యానించారు. మునుగోడులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని, అది నయమయ్యే పరిస్థితి లేదని మర్రి శశిధర్ రెడ్డి అననారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడుతున్నానని ఆయన అన్నారు. చెంచాగాళ్లతో పార్టీని నడిపిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకింది....
రెండు మూడు రోజుల్లో తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వవద్దని తాను కూడా చెప్పానని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు లేదన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదన్నారు. తాను పార్టీ మారడానికి అనేక కారణాలున్నాయని ఆయన అన్నారు. అన్నీ ఆలోచించిన తర్వాతనే పార్టీ మారుతున్నానని ఆయన తెలిపారు. రాజకీయాల నుంచి ఇప్పట్లో రిటైర్ కావడం ఇష్టం లేకనే తాను పార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించారు.
Next Story

