Sun Feb 01 2026 11:15:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర
నేడు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభించనుంది

నేడు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభించనుంది. మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వరకూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయింది. ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాకముందే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ప్రారంభించింది.
అగ్రనేతలందరూ...
మునుగోడు ఉప ఎన్నికలో టిక్కెట్ కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కమిటీ నిర్ణయించింది. అభ్యర్థి ఎవరైనా బలంగా ఉన్న కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్న కారణంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ పాదయాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొననున్నారు.
Next Story

