Fri Dec 05 2025 06:20:28 GMT+0000 (Coordinated Universal Time)
Congress : రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర
రేపు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తుంది. దీనికి జనజాతరగా నామకరణం చేశారు

రేపు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తుంది. దీనికి జనజాతరగా నామకరణం చేశారు. తుక్కుగూడలో ఈ సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇప్పటికే తుక్కగూడలో కాంగ్రెస్ సభకు సంబంధించిన ఏర్పాట్లూ పూర్తి కావచ్చాయి. ముఖ్యమంత్రి, పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో...
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పథ్నాలుగు పార్లమెంటు స్థానాల్లో గెలిచేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. ఇందుకోసం రేపటి సభతో శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే దాదాపు పథ్నాలుగు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈరోజు కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫేస్టోలోని అంశాలను కూడా రేపటి సభలో ప్రస్తావించనున్నారు. పెద్దయెత్తున జిల్లాల నుంచి జనసమీకరణకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
Next Story

