Fri Mar 27 2026 05:01:33 GMT+0530 (India Standard Time)
అస్సాం సీఎంపై కాంగ్రెస్ ఫిర్యాదులు నేడు
కాంగ్రెస్ పార్టీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మపై నేడు అన్ని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయనుంది

కాంగ్రెస్ పార్టీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మపై నేడు అన్ని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయనుంది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎం పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. నిన్ననే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం పోలీస్ స్టేషన్ లో అస్సాం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి....
రాహుల్ గాంధీపై ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఆ వ్యాఖ్యలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలను చేసింది. ఈరోజు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నారు.
Next Story

