Sat Mar 07 2026 11:49:16 GMT+0530 (India Standard Time)
"ఐ విల్ మిస్ యూ డాడీ" అంటూ ఎంపీ భావోద్వేగం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మరణంతో ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి గురయ్యారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మరణంతో ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణం తనను కలచివేసిందని, తన తండ్రి, గురువు, అన్నీ నాన్నే అంటూ ఎక్స్ వేదికగా అరవింద్ ట్వీట్ చేశారు. అన్నా అంటే నేనున్నానంటూ ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు అంటూ అని కామెంట్ చేశారు. ఐ విల్ మిస్ యూ డాడీ అంటూ అంటూ బాధపడ్డారు. భయడకు అని నేర్పింది నాన్నేనని, ప్రజలను ప్రేమించు, ప్రజల కోసమే జీవించు అని చెప్పింది మా నాన్న అని, నువ్వు ఎప్పటికీ నాతోనేనే ఉంటావు, నాలోనే ఉంటావంటూ ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి గురయ్యారు.
రేపు అంత్యక్రియలు...
కాంగ్రెస్ పార్టీ సీనియర్నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారు జామున మరణించిన సంగతి తెలిసిదే. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేపు నిజామాబాద్ లో ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం నిజామాబాద్ లోని ఆయన స్వగృహానికి డీఎస్ పార్ధీవ దేహాన్ని తీసుకురానున్నారు. డీఎస్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

