Thu Mar 19 2026 11:00:19 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది.

పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. ఆడియో లీకులపై పార్టీ అధిష్టానం స్పందించింది. పది రోజుల్లోగా సమాధానమివ్వాలని కోరింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఆయన వచ్చిన తర్వాత షోకాజ్ నోటీసుకు సమాధానమిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పది రోజుల్లో...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలంటూ ఆడియో విడుదలయిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకమాండ్ పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
Next Story

