Sun Mar 15 2026 00:15:34 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలు
నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలను చేయాలని నిర్ణయించింది.

నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలను చేయాలని నిర్ణయించింది. నిన్న రాత్రి కాంగ్రెస్ వార్ రూమ్ పై చేసిన దాడికి నిరసనగా ఆందోళనలు చేయాలని నిశ్చయించింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు నిరసనల్లో పాల్గొనాలని, అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలని, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
వార్ రూమ్ సీజ్ ...
నిన్న రాత్రి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు చెందిన కార్యాలయంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి అక్కడ సిబ్బంది సెల్ఫోన్లు తీసుకెళ్లారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కార్యాలయాన్ని పోలీసుల సీజ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీనిపై నేడు పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.
Next Story

