Sun Mar 15 2026 21:31:49 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్తో కేసీఆర్ కలవక తప్పదు : కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదని ఆయన అన్నారు. ఇద్దరికీ అరవై మించికి సీట్లు రావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ సెక్యులర్ పార్టీలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
హంగ్ ఖాయం...
కాంగ్రెస్ గాడిలో పడుతుందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త అయినా.. పాత అయినా గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత పొత్తులు ఉండే అవకాశముందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. మార్చి 1 నుంచి తాను పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
Next Story

