Sat Dec 13 2025 22:33:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జూబ్లీహిల్స్ లో రేవంత్ రప్పా .. రప్పా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆరో రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆరో రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ కు ఆధిక్యత పెరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కంటే దాదాపు పన్నెండు వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆరో రౌండ్ లో..
రౌండ్ రౌండ్ కి కాంగ్రెస్ ఆధిక్యంలో కొంత మెరుగ్గా కనపడుతుంది. తొలి రెండ్ లో మాత్రమే నువ్వా? నేనా? అన్నట్లు సాగిన పోరు రెండో రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూకుడు పెంచాడు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి మాత్రం స్వల్పంగానే ఓట్లు పోలవుతున్నాయి. ఆరో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికే మెజారిటీ రావడంతో గాంధీభవన్ లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతలు రప్పా.. రప్పా... తగ్గేదేలా అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు.
Next Story

