Sun Mar 08 2026 02:54:55 GMT+0530 (India Standard Time)
నేడు మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళతారు. మేడిగడ్డ రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళతారు. మేడిగడ్డ రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు. ఉదయం పది గంటలకు అసెంబ్లీకి చేరుకుని ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు వెళతారు.
రేవంత్ రెడ్డితో పాటు...
ఉదయం పది గంటలకు బయలుదేరిన రేవంత్ రెడ్డి తో కూడిన ఎమ్మెల్యేల బృందం మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డకు చేరుకోనుంది. అక్కడ రెండు గంటల పాటు ప్రాజెక్టును సందర్శిస్తారు. కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అక్కడ అధికారులు ఎమ్మెల్యేలకు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని వివరిస్తారు. అనంతరం ఐదు గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఈ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి.
Next Story

