Tue Jan 20 2026 23:31:03 GMT+0000 (Coordinated Universal Time)
Medigadda: మేడిగడ్డకు బయలుదేరిన ఎమ్మెల్యేలు
అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక బస్సుల్లో వారు అసెంబ్లీ ప్రాంగణం నుంచి బస్సుల్లో వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. రోడ్డు మార్గాన వీరు బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకోనున్నారు.
బ్యారేజీని సందర్శించి....
అక్కడ దాదాపు రెండు గంటల పాటు ఉంటారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా, మేడిగడ్డపై ఎమ్మెల్యేలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్ల రాకకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ సందర్శనకు ఎంఐఎం, సీపీఐ సభ్యులు వెళ్లగా, బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు దూరంగా ఉన్నారు. తిరిగి రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ కు ఈ బృందం చేరుకోనుంది.
Next Story

