Fri Dec 05 2025 17:10:36 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి వదలడం లేదుగా...?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలను నేరుగా చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలను నేరుగా చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులలో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. పదవులు మీకే..పైసలు మీకేనా...అంటూ నిష్టూరమాడారు. పదవులు తీసుకోండి.. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి..అంటూ మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యానించారు.
నేరుగా విమర్శలు చేసి...
నిన్న ఉదయం క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయగా రాజకీయాల్లో పదిమంది పోటీ పడినా.. కుర్చీ ఒక్కరికే దక్కుతుందని.. అది అన్నదమ్ములైనా.. ఇంకెవరైనా.. అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. తర్వాత మునుగోడులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఇంతకుముందువరకూ రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ సారి మాత్రం నేరుగా ఆయన పేరు ప్రస్తావించి మరీ విమర్శలు చేయడం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story

