Wed Jan 28 2026 19:50:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి ఘాట్ కౌంటర్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తానే పదేళ్లు సీఎం అని ప్రకటించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
పదేళ్లు సీఎం అంటూ...
కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం మేరకే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది నిర్ణయం జరుగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను నిఖార్సయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సహకరించరని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాన్ని ఎవరూ సహించరని కూడా అన్నారు.
Next Story

