Sun Mar 15 2026 14:04:33 GMT+0530 (India Standard Time)
మర్రి పార్టీ మారితే నష్టమే మరి
మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే నష్టమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే నష్టమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దానికి పూర్తి బాధ్యత రేవంత్, మల్లు భట్టి విక్రమార్కదేనని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన హైకమాండ్ కు లేఖ రాశారు. రాహుల్ పాదయాత్ర ముగిసిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించాల్సి ఉందని, అయితే జూమ్ మీటింగ్ ఏంటని ఆయన ప్రశ్నించారు. అందరం కలసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన తరుణంలో సీఎల్పీ, పీసీసీ సమన్వయంతో వ్యవహరించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
సమన్వయం చేసుకోవడంలో...
రాహుల్ పాదయాత్రలో వన్ మ్యాన్ షో చేయాలని రేవంత్ చూస్తే ఎలా అని ఆయన పర్శ్నించారు. ఎన్నికల ముందు పీసీసీని మార్పు చేయాలని తాను కోరడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా కంపెనీయా? ఇంట్లోని కూర్చోని మాట్లాడుకోవడానికి అని ఆయన నిలదీశారు. వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పేనని ఆయన అన్నారు. పార్టీ వ్యవస్థ సరిగా లేదన్నారు. దీనికి తాను కూడా బాధ్యుడినేనని ఆయన అన్నారు.
Next Story

