Sun Mar 15 2026 14:07:47 GMT+0530 (India Standard Time)
ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగ్గారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తన నియోజకవర్గ సమస్యలపై చర్చించాలని వచ్చానని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి కేసీఆర్ ను కలసి చర్చించానని జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు. కేసీఆర్ ను కలసినంత మాత్రాన తనను కోవర్టుగా కొందరు ముద్ర వేస్తున్నారన్నారు.
ప్రధానిని కలిస్తే...
కాంగ్రెస్ ఎంపీలు కొందరు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే తప్పు లేదు కాని తాు మాత్రం కేసీఆర్ ను కలిస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. చాటుగా కలిసే వాళ్లు చాటుగానే కలుస్తున్నాన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి గురించి తప్ప మరే విషయాలను కేసీఆర్ వద్ద ప్రస్తావించలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పటికే తనపై కొందరు కోవర్టు అని ముద్ర వేశారని, ఎవరేమనుకున్నా తనకు తన నియోజకవర్గమే ముఖ్యమన్నారు.
- Tags
- jaggareddy
- kcr
Next Story

