Thu Dec 18 2025 07:23:58 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేవంత్ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే డుమ్మా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కాలేదు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కాలేదు. వరంగల్ లో జరిగిన ఇందిరా శక్తి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సభకు నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారు. వాస్తవానికి దొంతి మాధవరెడ్డి రేవంత్ సభకు గైర్హాజరవ్వడం ఇదే తొలి సారి కాదు.
గతంలోనూ రెండు సార్లు...
గతంలోనూ రెండు సార్లు ఆయన గైర్హాజరయ్యారు. ఆయన అసంతృప్తిగా ఉండి రేవంత్ సభలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. వరంగల్ లో దొంతి మాధవరెడ్డి ఇంటికి సమీపంలోనే కాంగ్రెస్ బహిరంగ సభ జరుగుతున్నప్పటికీ ఆ సభకు దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారు. గతంలో రెండు సార్లు వరంగల్ కు రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ దొంతి మాధవరెడ్డి కలవడానికి ఇష్టపడలేదు. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించినా ఆయనను కూడా దొంతి మాధవరెడ్డి కలవకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Next Story

