Fri Dec 05 2025 08:03:04 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కేసీఆర్ సారూ.. బిందాస్ గా ఉండండి.. రెడీ అయిపోండి దొరా
కాంగ్రెస్ పార్టీకి శత్రువుల ఎవరూ ఉండరు. ప్రత్యర్థులు కూడా ఎవరూ ఏమీ చేయలేరు.

కాంగ్రెస్ పార్టీకి శత్రువుల ఎవరూ ఉండరు. ప్రత్యర్థులు కూడా ఎవరూ ఏమీ చేయలేరు. కానీ కాంగ్రెస్ ఓటమికి మాత్రం కారణం ఆ పార్టీనేతలేనని చెప్పాలి. జనం ఓట్లేసి గెలిపించి అధికారాన్ని అప్పగించినా దానిని నిలుపుకోవడం చేతకాని ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎవరు వారు తోపులు. తమవల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఫీలింగ్ బలంగా నేతల్లో ఉంటుంది. అందుకే వారు ఏమాట్లాడుతున్నారో.. ఎవరికీ అర్ధం కాదు. గతంలో మాదిరి కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు చేరుతున్నాయి. భయం లేదు.. భక్తి లేదు.. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలే శత్రువులు అని చెప్పడానికి సందేహం లేదు.
పార్టీ పతనానికి వారు...
ఒక్కోసారి వారు చేసే వ్యాఖ్యలు పార్టీ పతనానికి కూడా దారి తీస్తాయి. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలువైరల్ గా మారాయి. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆలస్యంగా సభకు రావడంతో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మీడియా మైకులు క్యాచ్ చేశాయి. అంతటి పరుష పదజాలాన్ని నిజంగా పొన్నం ప్రభాకర్ గతంలో ఎన్నడూ ఉపయోగించలేదు. స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చిన నేత కావడంతో ఆచి తూచి వ్యవహరించే నేతగా పార్టీలో గుర్తింపు పొందిన పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఒక సామాజికవర్గం వారిని కించపర్చే విధంగా మారాయి. కానీ తాను అడ్లూరి లక్ష్మణ్ గురించి మాట్లాడలేదని పొన్నం ప్రభాకర్ ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇద్దరు మంత్రుల మధ్య...
పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ లది ఒకే జిల్లా. ఇద్దరూ కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు కావడంతో ఏదైనా పాత పగలు ఉన్నాయేమోనని కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. కానీ అడ్లూరి లక్ష్మణ్ మాత్రం తాను మాదిగ సామాజికవర్గానికి చెందిన వాడిని కాబట్టి, మంత్రి పదవి వచ్చిందని పొన్నం ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. ఆయన తనకు తాను తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలంటున్నారు. మరొకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరి మంత్రుల మధ్య మొదలయిన రచ్చ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. రేపు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. నష్టనివారణ చర్యలు చేపట్టాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి కాంగ్రెస్ ను ఓడించడానికి కేసీఆర్ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని, వారి పార్టీని వారే ఓడించుకుంటారని, బిందాస్ గా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్స్ నెటిజెన్లు చేస్తున్నారు.
Next Story

