Sun Mar 15 2026 21:33:19 GMT+0530 (India Standard Time)
గాంధీ భవన్ కు వచ్చిన కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ కు వచ్చారు.

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ కు వచ్చారు. ఇన్ ఛార్జి మాణిక్రావు థాక్రే ఆహ్వానం మేరకు ఆయన గాంధీభవన్ కు వచ్చినట్లు చెప్పారు. తాను గాంధీభవన్ లో కాలుపెట్టనని ఎప్పుడూ చెప్పలేదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో కూడా ఆయన మాటామంతీ కలిపారు.
ఆయన ఆహ్వానంతోనే....
కొత్త ఇన్ఛార్జి తనను ఆహ్వానించడంతోనే తాను గాంధీభవన్ కు వచ్చానని తెలిపారు. సీనియర్ నేతలందరితో మాణిక్రావు థాక్రే భేటీ అవుతున్నారు. వారి సూచనలు కూడా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ లో కమిటీలతో పాటు ఈ నెల 26వ తేదీ నుంచి జరగనున్న పాదయాత్రపై కూడా వారితో చర్చించనున్నారని తెలిసింది.
Next Story

