Fri Mar 20 2026 07:45:46 GMT+0530 (India Standard Time)
రేపు సీఎల్పీ సమావేశం.. ఆహ్వానితులు వీరే
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం రేపు జరగనుంది

కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం రేపు జరగనుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయిస్తారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ సీఎల్పీ నేతలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరవుతారు.
నియోజకవర్గ సమస్యలు....
ప్రతి నియోజకవర్గం నుంచి సమస్యలను తెలుసుకుని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది
Next Story

