Fri Mar 27 2026 08:25:35 GMT+0530 (India Standard Time)
రేపు సీఎల్పీ అత్యవసర సమావేశం
కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం రేపు అత్యవసరంగా నిర్వహించాలని నిర్ణయించారు

కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం రేపు అత్యవసరంగా నిర్వహించాలని నిర్ణయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్ చేసి రేపు సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వనమా రాఘవ బాధితులకు అండగా ఉండేలా కార్యాచరణ ప్లాన్ చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి కోరారు.
వనమా బాధితులకు....
దీంతో జగ్గారెడ్డి సూచనను సానుకూలంగా స్వీకరించిన భట్టి విక్రమార్క రేపు అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో వనమా రాఘవ బాధితులు అనేక మంది ఉన్నారు. పోలీసులే పన్నెండు కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వనమా రాఘవ బాధితులకు అండగా నిలిచి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం అయ్యేందుక రేపటి సమావేశంలో కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
Next Story

