Fri Dec 05 2025 13:29:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు సీఎల్పీ సమావేశం
నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో స్థానికసంస్థ ఎన్నికలపై చర్చ జరగనుంది

నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు మాదాపూర్ లోని ట్రెడెంట్ హోటల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రె్ పార్టీ గెలుపు దిశగా ఎలా పయనింప చేయాలన్న దానపై దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి అన్ని స్థానాల్లో గెలిచే విధంగా వ్యూహాలను ఎక్కడికక్కడ రూపొందించుకోవాలని నేతలకు సూచించనున్నారు.
Next Story

