Wed Feb 19 2025 22:01:43 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి భట్టి పాదయాత్ర
కాంగ్రెస్ శాసనభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహించే మధిర నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపడుతున్నారు

ఖమ్మం : కాంగ్రెస్ శాసనభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహించే మధిర నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ భట్టి విక్రమార్క ఈ పాదయాత్ర చేపడుతున్నారు. నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ యాత్రను ఆయన చేపడుతున్నారు. మూడు సార్లు మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క ఈసారి కూడా ఇక్కడ గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు. అందుకే ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు ఆయన నేటి నుంచి పాదయాత్ర చేపడుతున్నారు.
నెల రోజుల పాటు........
పాదయాత్ర ముదిగొండ మండలం యడవల్లి గ్రామం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 32 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. 506 కిలోమీటర్ల మేర యాత్ర జరుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి మండలంలో ఏడు రోజులు యాత్ర జరిగేలా ఏర్పాట్లు చేశారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఈ యాత్ర సాగనుంది. ఎర్రుపాలెం మండలం జమలాపురం వద్ద ఈ యాత్రను ముగిస్తారు. ఇక్కడ భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి జాతీయ కాంగ్రెస్ నేతలను పిలవాలని నిర్ణయించారు.
Next Story