Fri Feb 13 2026 19:54:30 GMT+0530 (India Standard Time)
Telangana : కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ దే హవా
తెలంగాణలో జరిగిన ఏడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాలుగింటిలో ఆధిక్యత కనపరుస్తుంది

తెలంగాణలో జరిగిన ఏడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాలుగింటిలో ఆధిక్యత కనపరుస్తుంది. నాలుగు కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం అందుకునే దిశగా అడుగులు వేస్తుంది. మిగిలిన మూడు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాలలో అరవై డివిజన్లుండగా, అందులో యాభైకి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది.
బీజేపీ రెండు స్థానాల్లో...
కొత్తగూడెంలో కమ్యునిస్టులు, కాంగ్రెస్ హోరా హోరాగాపోరాడుతున్నాయి. మొత్తం అరవై డివిజన్లున్న ఈ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 22, సీపీఐ 22 స్థానాలను గెలుచుకుంది. సీపీఎం, బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. అయితే మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్ ఆధిక్యతతో ఉంది. నల్లగొండ కార్పొరేషన్ లో అనుకున్న స్థాయిలో ఏకపక్షంగా ఫలితాలు రాకపోయినా చివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ కానున్నారు. బీజేపీ రెండు కార్పొరేషన్లలో ఆధిక్యంలో కొనసాగుతుందని ఓటర్ల సరళిని బట్టి తెలుస్తోంది.
Next Story

