Fri Feb 13 2026 15:42:46 GMT+0530 (India Standard Time)
కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా
తెలంగాణలో జరిగిన ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో జరిగిన ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటి వరకూ బోణీ కొట్టలేదు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన సిబ్బంది తర్వాత ఓట్లను లెక్కిస్తున్నారు.
రెండు కార్పొరేషన్లలో...
అయితే మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటీ నడుస్తుంది. అయితే కార్పొరేషన్లలో మాత్రం ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. రామగుండం కార్పొరేషన్ లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
Next Story

