Fri Dec 05 2025 11:28:27 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు పోలీసు కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటిచుట్టూ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అటువైపు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.
ముట్టడికి పిలుపు నివ్వడంతో...
రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ ఆలీలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కార్యాలయాలను ముట్టడించాలని కాంగ్రెస్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story

