Fri Dec 05 2025 23:53:04 GMT+0000 (Coordinated Universal Time)
జగ్గారెడ్డికి బుజ్జగింపులు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరుల ఫోన్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ హైకమాండ్ ను కలవాలని, రాజీనామా చేయవద్దని సూచించారు.
మెత్తబడిన ....
రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో తనను టీఆర్ఎస్ కోవర్టుగా చిత్రీకరిస్తుండటంపై జగ్గారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ నేతలు బుజ్జగించడంతో జగ్గారెడ్డి మెత్తబడినట్లు తెలిసింది. త్వరలో సోనియా, రాహుల్ ను కలసి తనపై జరుగుతున్న ప్రచారంపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు తెలిసింది.
Next Story

