Sat Mar 14 2026 19:10:56 GMT+0530 (India Standard Time)
విష్ణు అసహనం.. మీటింగ్ అందుకే
కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తన ఇంట్లో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తన ఇంట్లో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావాేశానికి సీనియర్ నేతలు వి. హనుమంతరావు, జగ్గారెడ్డి, మధుయాష్కి, మర్రిశశిధర్ రెడ్డి, కోదండరెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలకు విష్ణువర్థన్ రెడ్డి ఆహ్వానం పంపారు. ఇటీవల విష్ణువర్ధన్ రెడ్డి సోదరి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
తనకు తెలియకుండా...
తనకు తెలియకుండా చేర్చుకోవడం పై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు కనీసం మాట మాత్రం చెప్పకుండా తన నియోజకవర్గం పరిధిలో ఎవరినైనా ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు సీనియర్ నేతలను తన ఇంటికి విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story

