Sun Dec 14 2025 03:58:54 GMT+0000 (Coordinated Universal Time)
డీకే అరుణ 12 కోట్లు డిమాండ్ చేశారు
బీజేపీ నేత డీకే అరుణపై కాంగ్రెస్ నాయకుడు వంశీ చందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు

బీజేపీ నేత డీకే అరుణపై కాంగ్రెస్ నాయకుడు వంశీ చందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డీకే అరుణ గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పదిహేను కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చసేందుకు డీకే అరుణ ఈ మొత్తాన్ని తనకు ఇవ్వాలని పార్టీ ఎదుట డిమాండ్ పెట్టారని తెలిపారు. ఇది నిజమంటూ రామాలయంలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
ప్రమాణం చేయడానికి...
ఇందులో నిజం లేదని తెలిస్తే రామాలయానికి వచ్చి డీకే అరుణ కూడా ప్రమాణం చేయాలని వంశీచందర్ రెడ్డి కోరారు. కానీ డీకే అరుణ రాలేదంటే పాలమూరు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పాలమూరు ప్రజలు అంతా గమనిస్తున్నారని, నిజం ఎప్పుడూ విజయం వైపే ఉంటుందని వంశీచందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన సవాల్ ను డీకే అరుణ స్వీకరించలేకపోవడమే ఆమె నిజం ఒప్పుకున్నట్లయిందని వంశీ తెలిపారు.
Next Story

