Fri May 03 2024 04:53:11 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ ట్వీట్.. తెలంగాణలో అడుగుపెడుతూనే
కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణలో అడుగుపెడుతూనే ట్వీట్ చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆయన ట్వీట్ చేశారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగుపెడుతూనే ట్వీట్ చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆయన ట్వీట్ చేశారు. అభివృద్ధి గ్యారంటీ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి అంటూ ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
యాత్రగా బయలుదేరి...
వరంగల్్లోని రామప్పగుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాహుల్, ప్రియాంక గాంధీలు అనంతరం బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప గుడి నుంచి యాత్రగా ములుగు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో వారిరువురూ ప్రసంగించనున్నారు. మహిళ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.
Next Story