Sat Jan 31 2026 04:08:32 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు రాహుల్ బస్సు యాత్ర
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు కొనసాగనుంది.

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు కొనసాగనుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తొలి విడత బస్సు యాత్రలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. నిన్న ములుగులో జరిగిన బహిరంగ సభకు భారీగా జనం రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నెలకొంది. రాహుల్, ప్రియాంకలను చూసేందుకు వేల సంఖ్యలో జనం సభకు తరలి రావడంతో సభాప్రాంగణం నిండిపోయింది.
చేరికలు...
ఈరోజు బస్సుయాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. ఈరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకూ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు రాహుల్ నిరుద్యోగుల బైక్ ర్యాలీలో కూడా పాల్గొననున్నారు. కాటారంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడే భోజనం చేస్తారు. మంథని బైపాస్ నుంచి నేరుగా పెద్దపల్లికి చేరుకోనున్న రాహుల్ అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి కరీంనగర్ లో రాహుల్ బస చేయనున్నారు. ఈరోజు రాహుల్ సమక్షంలో భారీ సంఖ్యలో చేరికలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

