Sat Mar 07 2026 23:48:29 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో రాహుల్ పర్యటన షెడ్యూల్ ఖరారు
5.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ బయలుదేరి 5.45 గంటలకు వరంగల్‌లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. తెలంగాణలో రాహుల్ రెండ్రోజులు పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4.50 గంటలకు ప్రత్యేకవిమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు స్వాగతం పలుకుతారు. 5.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ బయలుదేరి 5.45 గంటలకు వరంగల్‌లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు. 6.05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బస చేస్తారు.
మే7, శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్క్‌కు చేరుకుంటారు. 12.50-1.10 మధ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. 2.45 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరడంతో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ముగుస్తుంది.
Next Story

