Fri Jan 30 2026 23:09:27 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : పేద వర్గాలతో రాహుల్ భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేద వర్గాలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేద వర్గాలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారితో సమావేశమై వారికి ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. డ్రైవర్స్, డెలీవరీ బాయ్స్, జీహెచ్ఎంసీ వర్కర్లతో ఆయన సమావేశమయ్యారు. తమకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. వారు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ కు వివరించారు. తాము రాజస్థాన్ లో గిగ్ వర్కర్స్ కోసం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఇక్కడ కూడా దానిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే...
అయితే తాము అధికారంలోకి వస్తే తాము వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే తమ పార్టీ ముఖ్యమంత్రిని మీ చేత సమావేశపర్చి సమస్యలను పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంపాదన అంతా పెట్రోలు, డీజిల్ కే సరిపోతుందని, ధరలు పెరుగుదలకు అనుగుణంగా తమ వేతనాలు పెరగడం లేదని వారు రాహుల్ తో చెప్పుకున్నారు.ఆ పూర్తి వీడియో ను ఇక్కడ చూడగలరు
Next Story

