Fri Dec 05 2025 22:51:05 GMT+0000 (Coordinated Universal Time)
మేడిగడ్డకు చేరుకున్న రాహుల్
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఆయనకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ ప్రాజెక్టు పరిశీలనకు పోలీసులు అనుమతిచ్చారు. కొద్దిసేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను మాత్రమే అనుమతించారు.
మహిళ సదస్సుకు...
ఇక ఎవరికీ లోపలికి అనుమతి లేదని పోలీసులు నిలిపేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డకు రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అంతకు ముందు అక్కడకు దగ్గరలో ఉన్న అంబటి పల్లికి వెళ్లారు. అక్కడ మహిళ సదస్సులో రాహుల పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు.
Next Story

