Thu Mar 19 2026 09:10:29 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్కు ప్రియాంక
ఈరోజు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ రానున్నారు. యూత్ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు

ఈరోజు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ రానున్నారు. యూత్ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ప్రియాంక పాల్గొంటారు. ఈ డిక్లరేషన్లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25వేల పెన్షన్, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతోపాటు నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల పెన్షన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
సరూర్ నగర్ స్టేడియంలో...
ప్రియాంక ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ స్టేడియంకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీ సభ నుంచి తిరుగు పయనమవుతారు. ప్రియాంక పర్యటన కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు.
Next Story

