Sun Mar 15 2026 11:13:22 GMT+0530 (India Standard Time)
కావాలనే కొందరు కుట్ర చేస్తున్నారు
తనపై కావాలనే కొందరు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు

తనపై కావాలనే కొందరు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లో ముఖ్యమైన నేతలను బయటకు పంపి కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కొందరు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని తాము ఉన్నామని, అటువంటి తమను పార్టీ నుంచి ఎందుకు వెళ్లగొట్టాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. సామాన్యకార్యకర్తగా తాను పార్టీలో పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులను తాను ఆశించడం లేదని ఆయన అన్నారు.
ఆయన మారినంత మాత్రాన...
రామరావు పటేల్ పార్టీ నుంచి వెల్లినంత మాత్రాన తాను పార్టీని వీడతానని ఎందుకు అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిసారీ తనపై ఆరోపణలు చేయడం కొందరికి అలవాటుగా మారిందన్నారు.పార్టీలో కొందరు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారన్నారు. గతంలో సోయం బాబూరావుకు, హరిప్రియకు రేవంత్ రెడ్డి టిక్కెట్ ఇప్పించారని, వారిద్దరూ పార్టీ మారారని, దీనికి రేవంత్ బాధ్యత వహించాలా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో అనేక మంది పీసీసీ చీఫ్ లు ఉన్నారని, అప్పుడు జరగని ప్రచారం ఇప్పుడు ఎందుకు జరుగుతుందని ఆయన మండి పడ్డారు.
Next Story

