Thu Jan 29 2026 01:47:26 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమయింది

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమయింది. ఆయన అమిత్ షాను కలవడం పై పార్టీ అగ్ర నేతల్లో చర్చ జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇలానే ఉపేక్షిస్తే పార్టీకి మరింత డ్యామేజీ జరుగుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. ఆయన కాంగ్రెస్ పై విమర్శలు చేయడం, బీజేపీని బహిరంగంగా పొగుడుతుండటం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని భావిస్తుంది.
సీనియర్ నేతలతో...
దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరింత ముదిరే అవకాశమున్నందున ముందుగానే కాంగ్రెస్ చర్యలు తీసుకుంద్న సంకేతాలను ప్రజల్లోకి, క్యాడర్ లోకి పంపడం మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరో వైపు వి.హనుమంతరావు లాంటి నేతలు కొందరు మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతలను దూరం చేసుకోవడం తగదని, ఆయన పార్టీ వీడకుండా మాట్లాడాలని, తొలి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.
Next Story

