Tue Mar 10 2026 03:54:03 GMT+0530 (India Standard Time)
Congress : నేడు రెండో జాబితా.. ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను
తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించే అవకాశముంది

Congress :తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించే అవకాశముంది. నేడు మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. నిన్న సమావేశమైన కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులను త్వరగా ఎంపిక చేసి ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ప్రచారానికి కావాల్సిన సమయం...
నాలుగోదశలో పోలింగ్ జరగనుండటంతో కావాల్సిన సమయం ఉంది. అందుకే అభ్యర్థులు ప్రతి గ్రామానికి వెళ్లేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ నేడు తెలంగాణలోని లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఎనిమితి లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
Next Story

