Sat Feb 14 2026 14:23:34 GMT+0530 (India Standard Time)
Telangana : కార్పొరేషన్ల ఎన్నికలోనూ కాంగ్రెస్
తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోగలిగింది.

తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోగలిగింది. మొత్తం ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా అందులో నాలుగింటిలో కాంగ్రెస్ గెలిచింది. ఒకదానిలో బీజేపీ విజయం సాధించింది. మరొక రెండు కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడింది. నల్గొండ కార్పొరేషన్, మంచిర్యాల కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, మహబూబ్నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
రెండింటిలో హంగ్...
కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ సొంతం చేసుకుంది. పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగిరినట్లయింది నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐలు అత్యధిక స్థానాలు సాధించగా, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్, బీజేపీలో ఎక్కువ డివిజన్లను సొంతం చేసుకుంది. ఈ నెల16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది.
Next Story

