Fri Dec 05 2025 11:59:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇద్దరు మంత్రులతో పీసీసీ చీఫ్ భేటీ
తెలంగాణ మంత్రుల మధ్య చెలరేగిన వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది.

తెలంగాణ మంత్రుల మధ్య చెలరేగిన వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఆయన తన ఇంటికి ఇద్దరు మంత్రులు రావాలని నిన్ననే ఫోన్ చేసి చెప్పారు. దీంతో నేడు హైదరాబాద్ లోని మహేష్‌గౌడ్ నివాసానికి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ లు చేరుకున్నారు.
వివాదంపై ఇద్దరి నుంచి...
ఇద్దరితో పీసీసీ చీఫ్ మాట్లాడుతున్నారు. అంతకుముందే అదే వేదికపైన ఉన్న మరో మంత్రి గడ్డం వివేక్ నుంచి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమాచారాన్ని సేకరించారు. మహేష్‌గౌడ్‌తో ప్రస్తుతం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూపొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తాను పార్టీ లైన్ దాటి ప్రవర్తించనని, పార్టీ కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడతానని, తాను చింతిస్తున్నట్లు ముందుగానే పొన్నం చెబితే ఇంత రాద్ధాంతం అయ్యేది కాదు గదా? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
Next Story

