Fri Dec 05 2025 09:10:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections Counting : బోణీ కొట్టిన కాంగ్రెస్
అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. తొలి ఫలితం కాంగ్రెస్ కే దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారయణ గెలుపొందారు

అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. తొలి ఫలితం కాంగ్రెస్ కే దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారయణ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. ఈసారి ఆయనను ప్రజలు ఆశీర్వదించలేదు.
ప్రతి రౌండ్ లోనూ...
అశ్వారావుపేటలో ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లోనే ఉన్నారు. చివరకు కాంగ్రెస్ దే గెలుపు ఖాయమయింది. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశముంది. పదికి పది స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉంది.
Next Story

