Wed Apr 24 2024 10:36:01 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ పోటీ.. ఆ రెండు చోట్ల...?
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించింది. ఖమ్మం, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించింది. ఖమ్మం, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని డిసైడ్ అయింది. మెదక్ లో నిర్మలా జగ్గారెడ్డి, ఖమ్మంలో రాయల్ నాగేశ్వరరావులు పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకపోయినా కాంగ్రెస్ బరిలోకి దిగాలని భావించింది.
బలం లేకపోయినా....?
నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. దీనిపై కాసేపట్లో స్పష్టత రానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖమ్మంలో తాతా మధు, మెదక్ లో యాదవ్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపింది. పెద్దగా బలం లేకపోయినా ఎన్నికల్లో తలపడాలని కాంగ్రెస్ భావించి అభ్యర్థులను రంగంలోకి దించింది.
Next Story