Thu Mar 19 2026 07:19:46 GMT+0530 (India Standard Time)
Congress : మూడుస్థానాలలో అభ్యర్థులు వీరే
నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న సమయంలో కాంగ్రెస్ మిగిలిపోయిన మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిన మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు గాను పథ్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధినాయకత్వం మూడు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది.
ఖమ్మం నుంచి...
అయితే నిన్న రాత్రి కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంటు నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి ఉల్లలా సమీర్ పేర్లను ప్రకటించింది. వీరంతా ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీంతో పదిహేడు స్థానాలకు కాంగ్రెస్ తన పార్టీ నుంచి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినట్లయింది.
Next Story

