Wed Mar 18 2026 22:06:49 GMT+0530 (India Standard Time)
నేడు కీలక మీటింగ్.. సీనియర్లు దూరం?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది. సాయంత్రం జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
పాదయాత్ర తర్వాత...
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తర్వాత దానికి కొనసాగింపుగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి సీనియర్ నేతలు దూరంగా ఉంటే హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయన్నది ఉత్కంఠగా మారింది.
Next Story

