Thu Mar 19 2026 11:56:20 GMT+0530 (India Standard Time)
హైకోర్టును ఆశ్రయించిన సునీల్ కనుగోలు
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాను విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాను విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆయన కోరారు. తాను విచారణకు హాజరు కావడానికి పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు ఈ నెల 8వ తేదీ వరకూ అనుమతించారు.
వార్ రూమ్ పై దాడి...
సునీల్ కొనుగోలు కార్యాలయంపై ఇటీవల తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు దాడి చేసి పలు సీడీలు, కంప్యూటర్ లతో పాటు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు పోస్టింగ్ లు పెడుతున్నారంటూ కాంగ్రెస్ వార్ రూమ్ గా భావిస్తున్న సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి చేశారు. అయితే సునీల్ కనుగోలు తనకు నోటీసులు ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించారు.
Next Story

