Fri Feb 13 2026 15:44:25 GMT+0530 (India Standard Time)
Breaking : ఆరు మున్సిపాలిటీల్లో హస్తందే విజయం
116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగిస్తోంది

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 116 మున్సిపాలిటీల్లో అత్యధిక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలు అత్యధికంగా కైవసం చేసుకుంది. నల్లగొండ జిల్లాలోని హాలియా, నందికొండూరు, చిట్యాల, చండూరులను కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లాలో మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ చేజిక్కించుకుంది.
మున్సిపల్ వార్డుల్లో...
బీఆర్ఎస్ రెండు మున్సిపాలీటలను దక్కించుకుంది. మొత్తం 2,281 మున్సిపాల్ వార్డుల్లో కాంగ్రెస్ 277 వార్డుల్లోనూ, బీఆర్ఎస్ 152 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ నలభై వార్డుల్లో విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశముంది.
Next Story

