Fri Feb 13 2026 15:40:04 GMT+0530 (India Standard Time)
కొడంగల్ కాంగ్రెస్ దే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం పన్నెండు వార్డులున్న కొడంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కొడంగల్ పురపాలక సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ పరమయిందని చెప్పాలి.
రేవంత్ ప్రాతినిధ్యం వహిసతుండటంతో...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గా ఉండటంతో కొడంగల్ ప్రజలు మరొక పార్టీ వైపు చూడలేదు. ముఖ్యమంత్రి తమ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తారని భావించి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఈ మున్సిపాలిటీని రేవంత్ రెడ్డికి కానుకగా ఇచ్చి తమ ప్రాంతానికి మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షతోనే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కే ఇచ్చారు.
Next Story

