Fri Dec 05 2025 11:13:49 GMT+0000 (Coordinated Universal Time)
Rashmi Perumal : "సృష్టి" ర్యాకెట్ ను బద్దలు కొట్టిన రష్మి పేరుమాళ్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
ఐపీఎస్ అధికారి సాధన రష్మి పెరుమాళ్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ రాకెట్టును ఛేదించినందుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

ఐపీఎస్ అధికారి సాధన రష్మి పెరుమాళ్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ రాకెట్టును ఛేదించినందుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె హైదరాబాద్ లో తన తొలి నియామకంలోనే అక్రమాలకు పాల్పడుతున్న వైద్యుల గుట్టును రట్టు చేయగలిగారు. తెలుగు మాట్లాడే కుటుంబం నుంచి రష్మి పెరుమఆల్ వచ్చినప్పటికీ, ఆమె తండ్రి ఆర్మీలో ఉండటం వల్ల ఉత్తరాది రాష్ట్రంలో పుట్టి పెరిగారు. సాధారణ జీవితం నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన రష్మి పెరుమాళ్ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోతుంది.సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జరుగుతున్న తంతగాన్ని పసిగట్టడంలో రష్మి పెరుమాళ్ తన తొలి ఆపరేషన్ ను దిగ్విజయంగా పూర్తి చేసి ఎందరో అమాయక కుటుంబాలను కాపాడగలిగినట్లయింది.
కల్నల్ కుమార్తెగా...
తెలంగాణ కేడర్‌కు కేటాయించిన ఏకైక మహిళా ఐపీఎస్ ప్రొబెషరీర్ అయిన సికింద్రాబాద్ అమ్మాయి సాధన రష్మి పెరుమాళ్ ఆర్మీ అధికారుల కుటుంబం నుంచి రావడంతో ఆమె ఆపరేషన్ ను పకడ్బందీగా చేయగలిగింది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి కల్నల్ ఎస్ఎం పెరుమాళ్ . ఆయన మరణించారు. రష్మి పెరుమాళ్ సోదరుడితోప పాటు వదిన ఇద్దరూ కూడా ప్రస్తుతం భారత సైన్యంలో పనిచేస్తున్నారు. రష్మి పెరుమాళ్ తండ్రి కల్నల్ పెరుమాళ్ అరుణాచల్ ప్రదేశ్ లోని ఆర్మీఫీల్డ్ అంబులెన్స్ కు యూనిట్ కు కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పుడు ఎల్.ఈ.డీ. పేలుడులో మరణించారు. 2009లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ఐపీఎస్ అధికారిగా రష్మి సాధన మారారు.
లోతుగా అధ్యయనం చేసి...
ఐపీఎస్ కావడంతో పాటు న్యాయవిద్యను కూడా రష్మి పెరుమాళ్ అభ్యసించారు. అందుకే సరోగసి కేసులో న్యాయసంబంధమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రష్మి తన జిల్లా శిక్షణను కరీంనగర్ లో పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ డీసీపీగా కొనసాగుతున్నారు. సరోగసి పేరుతో పేద దంపతులనుంచి శిశువులను కొనుగోలు చేయడం ఆ శిశువులను ఎక్కువ ధరకు విక్రయించడం వంటివి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ చేస్తుందని పసిగట్టారు. మరింత లోతుగా అధ్యయనం చేసిన రష్మి సాధన బిచ్చగాళ్ల నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వీర్యాన్ని సేకరించినట్లు కూడా కనుగొన్నారు. బిక్షగాళ్లకు బిర్యానీలు ఎరగా చూపి వారికి పోర్న్ వీడియోలు చూపించి వారి నుంచి వీర్యాన్ని సేకరించే వారని తేలింది. దీనికి సంబంధించిన కీలక ఫైళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ యజమానిని డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో రష్మి పెరుమాళ్ ప్రముఖ పాత్ర పోషించారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఐపీఎస్ అధికారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story

