బండి సంజయ్ కి సీఎం రెవంత్ రెడ్డి వార్నింగ్....!!!
బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్పందన. గద్దర్ గౌరవం విషయంలో సన్నిహిత ఘర్షణ!

కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని సీఎం రేవంత్ కేంద్రానికి లేఖ రాయగా, కేంద్రం పట్టించుకోలేదు.
దీనిపై సీఎం తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
గద్దర్ కు పద్మశ్రీ ఇచ్చేది లేదని ఆయన నక్సలైట్లతో కలిసి బీజేపీ నేతల్ని, పోలీసుల్ని చంపేశారని అలాంటి వారికి ఎలా అవార్డు ఇస్తారని బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు విమర్శలు చేశారు..!!
ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి..
""గద్దరన్నని గెటు బయట కూర్చో బెట్టిన వారికి ఏ గతి పట్టిందో..,గద్దరన్నని విమర్శించిన వారికి కూడా అదే గతి పడుతుంది "" అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు..!
ఇంకోసారి గద్దర్ మీద కామెంట్ చెస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు..!!!
ఇంకోసారి గద్దర్ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే..""మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ అని పేరు పెడతా.. అప్పుడు మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాయాలంటే గద్దరన్న గల్లీ అని రాయాలి బిడ్డా"" అని గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
గద్దర్ కి పద్మశ్రీ ఇవ్వనంత మాత్రాన ఆయన గౌరవం ఇసుమంత కూడా తగ్గదని,గద్దర్ ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా తీవ్రంగా స్పందించారు. అవార్డులు తమ వద్ద ఉన్నాయని బీజేపీ భావిస్తుందేమో కానీ, మీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు...!!!

