Thu Mar 26 2026 01:10:04 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు కేసీఆర్
సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ నుంచి హైదరాబద్ చేరుకోనున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ రాజకీయ నేతలను ఎవరినీ కలవలేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ నుంచి హైదరాబద్ చేరుకోనున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ రాజకీయ నేతలను ఎవరినీ కలవలేదు. ఆయన ఆరోగ్య పరీక్షల కోసమే ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఆమె కూడా ఈరోజు ఎయిమ్స్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్ననే పంటికి సంబంధించి వైద్యం చేయించుకున్నారు.
వ్యక్తిగత పర్యటనే....
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఢిల్లీ పర్యటన అంతా వ్యక్తిగతమని పార్టీ వర్గాలు చెప్పాయి. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. వివిధ పార్టీల నేతలు, ఢిల్లీ ముఖ్మమంత్రి కేజ్రీవాల్ ను కలుస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు పయనమవుతారని తెలిసింది.
Next Story

